నేడు కొత్తపేట MLA బండారు పర్యటన వివరాలు

నేడు కొత్తపేట MLA బండారు పర్యటన వివరాలు

కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 9 గంటలకు కొత్తపేట మండల ప్రజా పరిషత్ ఆవరణలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఉదయం 11 కు కొత్తపేట బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 కు రావులపాలెం లో జరిగే క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటారు అని తెలిపారు.