వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరగాలి: ఎస్పీ

వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరగాలి: ఎస్పీ

GNTR: ఎస్పీ సతీశ్ కుమార్ గుండవరం, గొడవర్రు గ్రామాలను, ఆ తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 90 అడుగుల వినాయక విగ్రహాన్ని శుక్రవారం రాత్రి సందర్శించారు. ఉత్సవ నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. ఊరేగింపులు, నిమజ్జనాలు సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరిగేలా చూడాలని, ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ముందస్తుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు.