కాశిబుగ్గ శివాలయం వద్ద సామూహిక 'వందేమాతరం' గీతాలాపన
WGL: వరంగల్ నగరంలోని కాశిబుగ్గ శివాలయం వద్ద గురువారం సామూహిక 'వందేమాతరం' గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.