రూ.1,70,800 నగదును బాధితుడికి అప్పగించిన ఎస్సై
SKLM: ఆమదలవలస పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపాడు దాబాలో భోజనం చేసిన జి .పృథ్వీరాజ్ తన వద్ద ఉన్న బ్యాగ్‌ను శనివారం అక్కడే మరిచిపోయాడు. అందులో రూ.1,70,800 నగదు ఉండటంతో వెంటనే డయల్ 112 ద్వారా ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి బ్యాగ్‌ను సురక్షితంగా స్వాధీనం చేసుకుని, నిన్న రాత్రి ఎస్సై బాలరాజు పృథ్వీరాజ్‌కు నగదును అందజేశారు.