రంపచోడవరంలో రైతులకు యూరియా పంపిణి

ASR: రంపచోడవరం మండలం తామరపల్లి గ్రామంలో రైతుల అవసరాలను తీర్చడంలో భాగంగా తామరపల్లి పంచాయతీ రైతు సేవ కేంద్రంలో గురువారం సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో యూరియా ఎరువుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యులు వంశి కుంజం పాల్గొని రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా బస్తాలు తక్కువగా మంజూరయ్యాయన్నారు.