గుంటూరులో నకిలీ రైల్వే టికెట్ల కలకలం

గుంటూరు: నకిలీ రైల్వే రిజర్వేషన్ టికెట్లు విక్రయిస్తున్న నిందితుడిని గుంటూరు GRPపోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెల్పిన వివరాల మేరకు.. డిగ్రీ చదువుకున్న విజయకుమార్ గుంటూరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద ప్రయాణికులతో తనకు లోపల తెలిసిన ఉద్యోగి ఉన్నాడని నమ్మించేవాడన్నారు. టికెట్ తెచ్చి ఇస్తానని డబ్బులు తీసుకొని నకిలీ రిజర్వేషన్ టికెట్లు ఇచ్చి మోసగిస్తున్నాడని స్థానికులు తెలిపారు.