'విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి'

JGL: సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను అదనపు కలెక్టర్ బీఎస్. లత గురువారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆమె ఆదేశించారు. అనంతరం ఈ కార్యక్రమంలో సారంగాపూర్ తహసీల్దార్ వహియొద్దీన్, తదితరులు పాల్గొన్నారు.