12కు చేరిన మృతుల సంఖ్య

12కు చేరిన మృతుల సంఖ్య

పాక్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందిన వారి సంఖ్య 12కు చేరింది. మరో 27 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ అమర్చి పేల్చినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువగా న్యాయవాదులు, కోర్టులో పని చేసే సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంత వరకూ ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు.