ఈ ఏడాది చివరిలో భారత్‌కు ట్రంప్‌..?

ఈ ఏడాది చివరిలో భారత్‌కు ట్రంప్‌..?

వచ్చే నవంబర్‌లో క్వాడ్ దేశాధినేతల సదస్సుకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని అమెరికా రాయబారి సెర్గీ గోర్ తెలిపారు. ఇందుకోసం ఆయన ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా, టారిఫ్ విషయంలో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొంతవరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే.