'బాహుబలి' పేరు పెట్టడం సంతోషం: రాజమౌళి

'బాహుబలి' పేరు పెట్టడం సంతోషం: రాజమౌళి

ఇస్రో 'LVM3-M5' రాకెట్‌కు 'బాహుబలి' అని పేరు పెట్టడం పట్ల దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. 'అంతరిక్ష పరిశోధనలో మన సాంకేతిక బలాన్ని ప్రదర్శించిన ఈ క్షణాలు దేశానికి గర్వకారణం. దాని బరువు, బలం కారణంగా ఈ రాకెట్‌కు ‘బాహుబలి’ అని ప్రేమగా పేరు పెట్టారు. ఇది నిజంగా మనందరికీ లభించిన గౌరవం. బాహుబలి చిత్ర బృందమంతా ఎంతో సంతోషించింది' అని పేర్కొన్నారు.