అవుకులో నేలకూలిన భారీ వృక్షం.!

NDL: జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయారు. కొలిమిగుండ్ల మండలంలోని చింతలాయపల్లె, కోరుమానుపల్లె తదితర గ్రామాల్లో అరటి పంట నేలకూలింది. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అవుకులోని మౌలాలి స్వామి దర్గా వద్ద పురాతన వృక్షం నేలకూలింది. పలు విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.