ప్రభుత్వం కీలక నిర్ణయం.. మారనున్న బస్సులు
AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాత డీజిల్ సూపర్ లగ్జరీ బస్సులను ఎలక్ట్రిక్ AC బస్సులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా చిత్తూరు జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో నిర్వహణ ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. చిత్తూరులో ఇప్పటికే గ్యాస్‌తో బస్సు నడిచేలా ప్రయోగాత్మక ఏర్పాట్లు జరుగుతున్నాయి.