రోడ్డుపైనే ధాన్యం కుప్పలు
KNR: సైదాపూర్- మొలంగూర్ ప్రధాన రహదారిపై దారి పొడవునా ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు వ్యవసాయ బావుల వద్ద, కల్లాల వద్ద భూమి తడిగా ఉండడంతో రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ధాన్యం పోసుకోవడానికి స్థలం లేకపోవడంతో గత్యంతరం లేక రోడ్లపైనే దాన్యం ఆరబోస్తున్నారు.