కేసలి నూతన పీఏసీఎస్ అధ్యక్షులు ఎంపిక

PPM: పాచిపెంట మండలం కేసలి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా మాదిరెడ్డి మజ్జారావు నియమితులయ్యారు. ఇవాళ పాచిపెంట పీఏసీఎస్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికు కృతజ్ఞతలు తెలిపారు.