ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి
SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండల సరిహద్దు ప్రాంతంలో పులి సంచారం పై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులతో అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. పులి దాడిలో చనిపోయిన పశువులకు త్వరలో ప్రభుత్వం తరపున నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.