అక్రమ ఇసుక డంపులు సీజ్
MDK: చేగుంట మండలం మక్కరాజుపేట శివారులో ఇవాళ అక్రమంగా నిలువచేసిన 20 ట్రాక్టర్ల ఇసుక డంపును సీజ్ చేసినట్లు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మక్కరాజుపేట శివారు పొలాల్లో అక్రమంగా తవ్వకాలు చేసి నిలువ చేసినట్లు సమాచారం రావడంతో దాడులు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుజాతతో కలిసి నిలువ చేసిన ఇసుకను సీజ్ చేసినట్లు వివరించారు.