VIDEO: ప్రభుత్వ కార్యక్రమాన్ని బైకాట్ చేసిన కౌన్సిలర్లు
KMR: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని BRS, BJP కౌన్సిలర్లు బైకాట్ చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని బైకాట్ చేసి వెళ్లిపోతున్న కౌన్సిలర్లను సమావేశానికి రావాలని కమిషనర్ కోరారు.