'అరకు చలి ఉత్సవాలను జయప్రదం చేయాలి'
ASR: 2026 సంవత్సరానికి గాను అరకు చలి ఉత్సవాలను జనవరి 3, 4 తేదీల్లో ఉండవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం కూడా చలి ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. చలి ఉత్సవాల నిర్వహణకు వివిధ శాఖల అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించారు.