సరికొత్త వెంచర్‌ను ప్రారంభించిన వీఎంఆర్డీఏ
విశాఖలోని చినముషిడివాడ వద్ద VMRDA 'ఎమరాల్డ్ వ్యాలీ' పేరుతో సరికొత్త వెంచర్‌ను ప్రారంభించింది. 4.70 ఎకరాల్లో 77 నివాస స్థలాలతో ఈ లేఅవుట్ రూపుదిద్దుకుంది. రూ.3 కోట్లతో సీసీ రహదార్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, నీటి సరఫరా వంటి వసతులు కల్పించారు. ఈ ఏడాదిలో మరో 1000 ప్లాట్లు అందుబాటులోకి తెస్తామని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.