నగరంలో మరో అగ్ని ప్రమాదం
HYD: నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెహిదీపట్నంలోని శృతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు ఎగసి పడుతుండటంతో జనాలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.