రహదారిపై బైఠాయించిన రైతులు
KNR: హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై గ్రామ రైతులు బైఠాయించారు. సింగపూర్లోని మత్తడి బ్రిడ్జ్ నిర్మాణంలో అలసత్వం, చిన్నగా నిర్మించడంతో పంటపొలాలు నీట మునిగాయని, పంట పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది