తగ్గిన పంట దిగుబడి.. ఆందోళనలో రైతులు
ASF: దహెగాం మండలంలోని వానాకాలంలో వరి సాగుపై వర్షాలు, తెగుళ్లు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఎకరాకు 45 బస్తాలు రావాల్సి ఉండగా.. 30 బస్తాల వరకే వరకే దిగుబడి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా అటు ఎరువుల ఖర్చులు అదనపు భారంగా సుమారు రూ. 4 వేల వరకు భారం పడుతోందని, నూర్పిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేందుకు మరో రూ.500 అదనంగా చెల్లించాల్సి వస్తుందన్నారు.