'రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు'

'రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు'

HNK: జిల్లా కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిపై నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌తో సహా ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు 108 సర్వీస్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు.