గ్యాస్ ఏజెన్సీల వద్ద జనం క్యూ..
ADB: ఆదిలాబాద్ లోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు భారీగా తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ కోసం బారులు తీరారు. గ్యాస్ కొరత వస్తుందనే అపోహలతో, మండుటెండల్లో గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు. గ్యాస్ కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ఆందోళన చెందవద్దని, సరిపడా స్టాక్ ఉందని పేర్కొన్నారు.