ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేయాలి: కలెక్టర్

WNP: జిల్లాలోని ఫర్టిలైజర్స్ షాపులలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని గాంధీచౌక్‌లో ఫర్టిలైజర్ షాప్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతులకు కావలసిన ఎరువులు కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.