'బాధిత కుటుంబానికి అండగా ఉంటాం'
BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కుంభ నాగేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మాధవరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.