భైంసా మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ గా డీఈఈ సుదర్శన్ రెడ్డి

ADB: భైంసా మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ గా డీఈఈ సీహెచ్. సుదర్శన్ రెడ్డి శుక్రవారం భాద్యతలు స్వీకరించారు. ఇది వరకు కమిషనర్ విధులు నిర్వహించిన ఎం. వెంకటేశ్వర్లు అవినీతి కేసులో ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో డీఈఈ సీహెచ్. సుదర్శన్ రెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సీడీఎంఏ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.