డి. హీరేహాళ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
ATP: డి.హీరేహాళ్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ వార్షికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదు, దర్యాప్తు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఫిర్యాదులు సకాలంలో స్వీకరించి న్యాయబద్ధంగా పరిష్కరించాలని సూచించారు. మహిళలు, చిన్నారుల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతం చేసి నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలని తెలిపారు.