'బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తాం'
GDWL: నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ కేటీదొడ్డి మండలంలోని చింతల కుంట, సుల్తానాపురం గ్రామాలలో శ్రీ భక్త కనకదాసు 538వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.