తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
AP: మాజీ సీఎం జగన్ ఈనెల 4న తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలించనున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. అనంతరం రైతులను పరామర్శించనున్నారు.