VIDEO: తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

SRD: ఎవరైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్తయ్య గౌడ్ హెచ్చరించారు. సదాశివపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర తన బీరువా దుకాణంలో అదే రాష్ట్రానికి చెందిన ఓ పంతులతో శాంతి పూజ చేయిస్తున్నాడని చెప్పారు. దీన్ని కొందరు క్షేత్ర పూజలుగా తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.