VIDEO: ఘనంగా శాంతామణిదేవి మహోత్సవం
ASR: యండపల్లివలస గ్రామంలో వెలసిన శాంతామణిదేవి రెండు రోజుల జాతర మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ పులివేషాలు, మేళతాలాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని గ్రామ పుట్టింటికి తరలించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు.