'భూభారతి సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి'

KNR: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్ పూర్, గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.