నేడు నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం

నేడు నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం

బీజేపీ నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నవీన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ అగ్ర నాయకులు హాజరుకానున్నారు. కాగా, నితిన్ ఐదుసార్లు బిహార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే, బీజేపీ అనుబంధ సంస్థల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.