కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KNR: హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి పథకం ఎన్నో పేద కుటుంబాలకు ఆసరా అయిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.