VIDEO: గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిపై వంటలు
AKP: నక్కపల్లి మండలంలో గ్యాస్ కొరత ఏర్పడిందని సీపీఎం మండల కార్యదర్శి మనబాల రాజేష్ తెలిపారు. శుక్రవారం ఎన్ నరసాపురంలో గ్యాస్ అందుబాటులో లేక కట్టెల పోయ్యపై వంట చేసుకుంటున్న ఇంటికి వెళ్లి రాజేష్ నీళ్లు మరగ బెట్టి నిరసన తెలియజేశాడు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం పలు అవస్థలు పడుతున్నారన్నారు.