సీపీఐ సీనియర్ సభ్యురాలు సుగుణమ్మ మృతి
KMM: చింతకాని మండలం నాగులవంచకి చెందిన సీపీఐ సినియర్ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వంకాయలపాటి సుగుణమ్మ (92) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జాతీయ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, కొండపర్తి గోవింద రావు, తదితరులు వారి పార్థివదేహాన్ని సందర్శించి పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు.