'కూటమి నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి'
PLD: సత్తెనపల్లి పట్టణం 6వ వార్డులో ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వార్డులోని గృహ, పెన్షన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఏ సమస్యలైనా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.