పిళ్లికొట్యాల్ ఎంసీహెచ్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన

పిళ్లికొట్యాల్ ఎంసీహెచ్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన

మెదక్ పిళ్లికొట్యాల్‌లో ఫైర్ సర్వీస్ వీక్ 2026లో భాగంగా స్థానిక మాతృ శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఫైర్ అధికారి జి. వేణు ఆదేశాల మేరకు, స్టేషన్ అధికారి కె. వెంకటేష్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందికి అత్యవసర స్థితిలో రోగులను సురక్షితంగా తరలించే విధానాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక పరికరాల వాడకంపై అవగాహన కల్పించారు.