'వీధిలైట్లు ఏర్పాటు చేయండి'
NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం రామకృష్ణ నగర్‌లోని పలు వీధుల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో SDPI నియోజకవర్గ అధ్యక్షుడు మహబూబ్ బాషా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని నగర కమీషనర్ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.