దారుణం: పిల్లలు పుట్టలేదని..!

దారుణం: పిల్లలు పుట్టలేదని..!

TG: కట్టుకున్న భర్తే.. భార్యను కడతేర్చిన ఘటన జగిత్యాలలో జరిగింది. సంతానం లేదని భర్త, అత్తమామలు మమత అనే వివాహితను వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలోనే భర్త మహేందర్.. భార్య మమతకు ఉరివేసి హతమార్చాడు. అనంతరం భార్య కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో తనిఖీ చేసిన పోలీసులకు కుళ్లినస్థితిలో మమత మృతదేహం లభ్యమైంది.