'తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలి'
BPT: రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగులకు తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో దివ్యాంగులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కక్ష పూరిత చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు.