సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

VZM: ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. జామి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ రికార్డులను, సీడీ ఫైల్స్‌ను తనిఖీ చేశారు. పార్కింగ్‌లో ఉన్న వాహనాలను చూసి ఎస్సైను ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తులకు వాహనాలు అందజేయాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు పై దృష్టి సారించాలన్నారు.