గుంతలు పూడ్చండి మహాప్రభో...!

VZM: కొత్తవలస మండలంలోని పలు బీటి రోడ్లు భారీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తుమ్మీకాపల్లి -సీతంపేట, కొత్తవలస -విజయనగరం రహదారిలో గిడిజాల రోడ్ జంక్షన్, అప్పన్నదోరపాలెం రోడ్డులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. R&B అధికారులు చర్యలు చేపట్టి గుంతలు పూడ్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.