నగరంలో కబ్జాల వల్లే ప్రమాదాలు: హైడ్రా కమిషనర్

HYD: నగరంలో గత రాత్రి భారీ వర్షం కారణంగా అఫ్జల్‌సాగర్‌లో ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. నాలాల కబ్జా వల్లే వరద సమయంలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైనవారి ఆచూకీ ఇంకా లభించలేదన్నారు. వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.