VIDEO: జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని నిరసన
సత్యసాయి: జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెనుకొండలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 6400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అరవింద్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.