కొత్తపాలెంలో వైభవంగా శ్రీరాములవారి కళ్యాణం
ప్రకాశం: పొన్నలూరు మండలం కొత్తపాలెంలో రాములవారి ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి రాములవారి కల్యాణం నిర్వహించారు. కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులతో పాటు గ్రామంలోకి వచ్చిన బంధువులతో ఆ ప్రాంతంలో గత మూడు రోజులుగా సందడి వాతావరణం నెలకొంది.