ముళ్ల పొదల్లో గంజాయి లభ్యం

KMM: ఖమ్మం కొత్త బస్టాండ్ వెనుక ఉన్న ముళ్ల పొదల్లో గంజాయి లభ్యమైంది. పక్కా సమాచారంతో ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సుంకరి రమేష్ సిబ్బందితో కలిసి ముళ్ల పొదల్లో ఉన్న సంచులను బయటకు తీశారు. మూడు సంచుల్లో ఉన్న గంజాయిని తూకం వేయగా 39.5 కిలోలుగా ఉందని సీఐ రమేష్ తెలిపారు. ఈ గంజాయి విలువ రూ.20 లక్షల మేరకు ఉంటుందని పేర్కొన్నారు.