'అలుపెరగని పోరాట ఫలితమే నేటి దేశ స్వాతంత్య్రం'

'అలుపెరగని పోరాట ఫలితమే నేటి దేశ స్వాతంత్య్రం'

KMM: అనేక మహనీయులు, ఉద్యమకారుల అలుపెరగని పోరాట ఫలితమే నేటి భారత దేశ స్వాతంత్య్రం అని తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తల్లాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి మండల అధ్యక్షుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.