VIRAL: సేంద్రియ సాగు చేస్తున్న వీఎస్సార్
AP: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ.. నెల్లూరు జిల్లా శంకరాపురంలోని తన వ్యవసాయ పొలంలో సేంద్రియ సాగు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో వీఎస్సార్ సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా 'జీవామృతం' తయారు చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.